Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

young man who in Goa was beaten to death with sticks

ఐవీఆర్

, గురువారం, 2 జనవరి 2025 (15:03 IST)
గోవాలో దారుణం జరిగింది. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు తాడేపల్లిగూడెం నుంచి 8 మంది స్నేహితుల బృందం వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ విషయంలో వీరంతా రెస్టారెంట్ వారితో ఘర్షణ పడ్డారు. దీనితో తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయిన రెస్టారెంట్ సిబ్బందిలో కొందరు పెద్దపెద్ద కర్రలు తీసుకుని దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకునేందుకు డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు ఈ 8 మంది యువతీయువకులు వెళ్లారు. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్... గడువులోగా బిల్లులు చెల్లించకుంటే....?