Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో వుడ్స్ ఇంద్రేషమ్‌ను ప్రారంభించిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్

Advertiesment
Woods Indresham

ఐవీఆర్

, సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (13:54 IST)
హైదరాబాద్: సుప్రసిద్ధ ఇంటిగ్రేటెడ్ బయోఫిలిక్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్, హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ప్రకృతి ప్రేరేపిత ప్లాట్టెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వుడ్స్ ఇంద్రేషమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అత్యున్నతంగా ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్ట్ 32 ఎకరాలలో విస్తరించి ఉంది. 267 నుండి 587 చదరపు గజాల వరకు 305 ప్రీమియం ప్లాట్‌లను అందిస్తుంది. ప్రారంభ ప్లాట్ ధరలు రూ. 80 లక్షలు నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టుతో కంపెనీ రూ. 250 కోట్ల విలువైన రాబడిని ఆశిస్తోంది.
 
పచ్చదనం కీలకంగా ఉన్న వుడ్స్ ఇంద్రేషమ్ ముఖ్య ఆకర్షణ ఒక ఎకరం మామిడి తోట, అలాగే ఈ ప్రాజెక్ట్‌లో రెండు ఎకరాల మియావాకి అడవి, ఏడు ఎకరాల బహిరంగ ప్రదేశాలు నివాసితులకు హరిత, నిశ్శబ్ద వాతావరణాన్ని అందిస్తాయి. నేటి వివేకవంతులైన గృహ కొనుగోలుదారుల అవసరాలను వుడ్స్ ఇంద్రేషమ్ తీరుస్తుంది. 
 
స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకురాలు- మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ, "స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్‌ వద్ద తాము ఇల్లు అంటే, కేవలం ఇటుక- మోర్టార్ కంటే ఎక్కువగా ఉండాలని నమ్ముతున్నాము. వుడ్స్ ఇంద్రేషమ్ అనేది ప్రకృతి ప్రేరేపిత డిజైన్, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను సహజ వాతావరణంతో మిళితం చేసే ఒక ప్రత్యేకమైన ఆఫరింగ్. ఇది ఒక ఎకరా మామిడి తోట, 2 ఎకరాల మియావాకి అడవి, దాదాపు 7 ఎకరాల బహిరంగ ప్రదేశాలను కలిగి ఉంది. బయోఫిలిక్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా, ఆరోగ్యం, కనెక్టివిటీ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కమ్యూనిటీ జీవనాన్ని పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. 
 
తమ విస్తరణలో భాగంగా, స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఇటీవల అసిస్టెడ్ లివింగ్(సీనియర్ లివింగ్)లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ త్వరలో హైదరాబాద్‌లో అతిపెద్ద, అత్యంత ప్రీమియం అసిస్టెడ్ లివింగ్ ప్రాజెక్ట్‌ను వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లోని యాదగిరిగుట్టలో ప్రారంభించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషం చంపేసి.. తానూ...