Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హయర్ ఇండియా నుంచి హెక్సా ఇన్వర్టర్ టెక్నాలజీతో సూపర్ హెవీ డ్యూటీ రేంజ్ ఎయిర్ కండీషనర్లు

HAIER

ఐవీఆర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (22:56 IST)
భారతదేశంలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ గృహోపకరణాల సంస్థ అని అనగానే అందరికి గుర్తుకు వచ్చే సంస్థ హయర్ ఇండియా. అంతేకాకుండా వరుసగా 15 ఏళ్ల పాటు గ్లోబల్ అప్లయన్సెస్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఎన్నో ఏళ్లుగా భారతీయుల మనసుని ఆకట్టుకున్న హయర్ ఇండియా.. ఇప్పుడు ఈ వేసవి కోసం సరికొత్త ఉత్పత్తులతో సిద్ధమైంది. అందులో భాగంగానే సూపర్ హెవీ-డ్యూటీ ఎయిర్ కండీషనర్‌లను విడుదల చేసింది. హెక్సా ఇన్వర్టర్ మరియు సూపర్‌సోనిక్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న కొత్త ఎయిర్ కండీషనర్లు... 20 రెట్ల వేగవంతమైన కూలింగ్‌ను అందిస్తాయి. అంతేకాకుండా దాదాపు 65% శక్తిని కూడా ఆదా చేస్తాయి.
 
అభివృద్ధి చెందుతున్న భారతీయుల అవసరాలకు అనుగుణంగా కస్టమర్‌కు కావాల్సిన ఆవిష్కరణలను రూపొందించడంలో తన అంకితభావాన్ని కొనసాగిస్తోంది హయిర్ ఇండియా. అందులో భాగంగానే హెక్సా ఇన్వర్టర్ టెక్నాలజీ, కేవలం 10 సెకన్లలో సూపర్‌సోనిక్ కూలింగ్, ఫ్రాస్ట్ సెల్ఫ్-క్లీన్ టెక్నాలజీ, ఇంటెల్లి కన్వర్టిబుల్ 7-ఇన్-1 వంటి అధునాతన ఫీచర్‌ లను కలిగి ఉన్న ఉత్పత్తులను అందిస్తూ సరికొత్త ప్రమాణాలను సెట్ చేస్తుంది. వేసవిలో ఫాస్ట్ కూలింగ్‌కు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా, కస్టమర్ యొక్క సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ, కొత్త శ్రేణి ఆవిష్కరణ, రూపకల్పన మరియు శక్తి సామర్థ్యాన్ని సజావుగా అనుసంధానిస్తుంది. 
 
ఈ సందర్భంగా హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సతీష్ మాట్లాడుతూ... “మా వినియోగదారుల జీవితాన్ని తెలివిగా, సౌకర్యవంతంగా ఉండేలా వినూత్న సాంకేతికతలతో ఆధారితమైన ఉత్పత్తులను రూపొందించాలని మేము విశ్వసిస్తున్నాము. భారతదేశం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను చవిచూస్తుంది. ముఖ్యంగా కఠినమైన వేసవి కాలం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మేము విపరీతమైన ఉష్ణోగ్రతలలో మనకు కావాల్సిన కూలింగ్‌ను నిర్ధారించడానికి, సౌలభ్యం, విశ్వసనీయత, పనితీరును పెంచడానికి హెక్సా ఇన్వర్టర్ సాంకేతికతతో శక్తి సామర్థ్యాన్ని కూడా చూసుకోవడానికి కొత్త శ్రేణి సూపర్ హెవీ-డ్యూటీ ఎయిర్ కండీషనర్‌లను రూపొందించాము. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి మరియు 2024లో రెండంకెల వృద్ధి పథం కోసం మేము సిద్ధంగా ఉన్నాము"  అని అన్నారు ఆయన.
 
“ఎన్నో ఏళ్లుగా, హయర్ యొక్క ఎయిర్ కండీషనర్ దాని వినూత్న లక్షణాలు, విశ్వసనీయ పనితీరు కారణంగా గణనీయమైన వృద్ధిని సాధించింది. దాని కొత్త శ్రేణిని పరిచయం చేయడంతో, హయర్ భారతదేశంలో ఎయిర్ కండీషనర్ విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, వృద్ధిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారుశ్రీ సతీష్ గారు.
 
హెక్సా ఇన్వర్టర్ టెక్నాలజీ ధర, అందుబాటు వివరాలు
 
• హయర్ సూపర్ హెవీ-డ్యూటీ ఎయిర్ కండీషనర్లు అన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రూ. 49,990 ధర ప్రారంభం అవుతాయి.
• లాంచ్ ఆఫర్‌లో భాగంగా, హయర్ రూ. 15,990 విలువైన గ్యాస్ ఛార్జింగ్, రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో సహా 5 సంవత్సరాల సమగ్ర వారంటీని అందిస్తోంది. అంతేకాకుండా రూ. 1500 విలువైన ఉచిత స్టాండర్డ్ ఇన్‌స్టాలేషన్ మరియు 12 సంవత్సరాల పాటు కంప్రెసర్ వారంటీని అందిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావలసింది రూ. 14,49,000, కానీ వచ్చింది కేవలం రూ.9000, అందుకే అవ్వాతాతలకు పింఛన్లు నిల్