ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ అమేజాన్ సంస్థ ఆయుర్వే ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు ముందుకు వస్తోంది. ఆయుర్వేద చికిత్సను విశ్వవ్యాప్తం చేసేందుకు అమేజాన్ ఇలా ముందుకు వచ్చింది. ఇది కేవలం భారతీయ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీదారుల కోసమేనని పేర్కొంది.
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నేతృత్వంలో నిర్వహించిన గ్లోబల్ ఆయుర్వేద మీట్ -2019 సదస్సులో పాల్గొన్న అమేజాన్ ఇండియా గ్లోబల్ సెల్లింగ్ హెడ్ రచిత్ జైన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అమేజాన్ ప్రారంభించనున్న కొత్త వెబ్ సైట్ ఆయుర్వేద ఉత్పత్తిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయుర్వేదంతో పాటు హెర్బల్, బ్యూటీ ఉత్పత్తులు కూడా అమేజాన్‌కు ముఖ్యమన్నారు. అమేజాన్‌లో ఇప్పటికే ఆయుర్వేదానికి సంబంధించి భారత్ నుంచి 50,000కి పైగా సెల్లర్స్ ఉన్నారని, వారందరికీ కొత్త సైట్ మరింత ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.