ధనస్సు
ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై అర్దాష్టమ శని ప్రభావం అంతగా ఉండదు. ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ప్రతి విషయంలోను ఆత్మస్థైర్యంతో ముందుకెళతారు. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి.
సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగివస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.
సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. తాహతుకు మించి హామీలివ్వవదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి.
నిత్యం సన్నిహితులు, ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. గృహ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు ఎదురైనా వెంటనే తగ్గిపోగలవు.
ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. రిటైర్డు ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. అధికారులకు హోదామార్పు, కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
న్యాయవాదులు అన్ని కేసులను గెలుస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. వసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలమే. ఆశించిన పంట దిగుబడి సాధిస్తారు. ప్రకృతిపరంగా కూడా అనుకూలం. సాధించిన పంట దిగుబడి మంచి ధర లభిస్తుంది.
కూరగాయలు, పండ్లు, పూలు సాగుచేయు రైతుల ఆదాయం బాగుంటుంది. విద్యాపరంగా విద్యార్థులకు ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. మంచి ఫలితాలు, ర్యాంకు సాధించటానికివ మరింతగా శ్రమించాలి. ముఖ్యంగా ప్రేమవ్యవహారాలు, ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు దూంగా ఉండాలి.
వ్యాపారులు గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. షాపుల స్థలమార్పు అనివార్యం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
టార్గెట్లను కూడా విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సభలు, కీలక సమావేశాల్లో తరచుగా పాల్గొంటారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి కార్యసిద్ధి, వ్యవహారజయం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యలాభం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి.