Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహరాశి : మఖ 1 2 3 4 పాదములు, పుబ్బ 1 2 3 4 పాదములు, ఉత్తర 1వ పాదము ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం-7 అవమానం - 7 ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం ఉత్సాహంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. అవివాహితులకు శుభదాయకం. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఎదురైనా వెంటనే సమసిపోగలవు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ద్వితీయార్ధం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సమస్యలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ముఖపరిచయం ఉన్న వారు మీకు సన్నిహితులవుతారు. వ్యవహారాలు, సంప్రదింపుల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టాలు, ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు ఒకటికి పదిసార్లు తిరగవలసి వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. వీరికి ఈ సంవత్సరం చివరిలో ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు కొంతమంది అడ్డుతగులుతారు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు. లెక్చరర్లకు బదిలీతో కూడిన ప్రమోషన్. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమాత్రం కలిసిరావు. సాంకేతిక, వైద్యరంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. డాక్టర్లకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. వ్యవసాయ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. పంట చేతికొచ్చే సమయానికి అవాంతరాలెదురవుతాయి. సాధించిన పంట దిగుబడి స్వల్పమైనా మద్దతు ధర లభిస్తుంది. ముఖ్యంగా చెరకు, పత్తి, అరటి, పొగాకు పండించే రైతులకు దిగుబడి బాగున్నా మద్దతు ధర లభించటం కష్టమే. శ్రామిక రంగాల వారు తరుచు ధర్నాలు, సమ్మెలకు పాల్పడతారు. యాజమాన్యం వైఖరిలో మార్పు వస్తుంది. చర్చలు ఫలించి అనుకున్న ఫలితాలు సాధించగల్గుతారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. వీరికి విదేశీ విద్యావకాశం లేకున్నా దూర ప్రాంతంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరుచుగా వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహంలో శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు మాత్రం దక్కవు. కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటారు. తరచుగా ప్రయాణాలు సాగిస్తుంటారు. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లటం క్షేమం కాదు. విదేశీ సందర్శనలకు పాస్ పోర్టు, వీసాలు మంజూరవుతాయి. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాలుగా ఉంటుంది.