Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మేషం
మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయం 8, వ్యయం : 14, రాజపూజ్యం : 4, అవమానం: 3 ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. చిత్తశుద్ధితో శ్రమించిన గాని ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం, అకారణ కలహాలు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరుచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటె రబీ ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. ఈ రాశివారికి అభయాంజనేయస్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.