Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3 ఈ రాశివారికి శుభయోగం. రుణ సమస్యల నుంచి బయటపడుతారు. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత వుంది. ఆదాయం బాగుంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్వయం కృషితో రాణిస్తారు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువులు చేరువవుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. మూల నక్షత్రం వారు కృష్ణ వైఢూర్యం, పూర్వాషాఢ వారు వజ్రం, ఉత్తరాషాఢ వారు స్టార్ రూబి ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశి వారు శ్రీమన్నారాయణుడిని పున్నాగపూలతో పూజించడం వల్ల శుభం, జయం, పురోభివృద్ధి పొందుతారు.