Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 4 అవమానం : 7 ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. తరచు వేడుకలు, దైవ పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. అవగాహన లేని వ్యాపారాల జోలికి పోవద్దు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. క్రీడా పోటీల్లో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు. ఉత్తరా నక్షత్రం వారు స్టార్‌రూబి, హస్తానక్షత్రం వారు స్పందనముత్యాన్ని, చిత్తనక్షత్రం వారు జాతి పగడాన్ని ధరించినట్లైతే శుభం కలుగుతుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి పొందుతారు. గజలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది