Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 1 అవమానం : 2 ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. రుణయత్నాలు కొనసాగిస్తారు. ఆస్తి వివాదాలు, భూ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. పెద్దల ప్రమేయంతో సమస్యలు పరిష్కారం కాగలవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. నోటీసులు అందుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధ్యాయుల బదిలీ యత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్‌ వ్యాపారులకు ఏమంత పురోగతి వుండదు. వృత్తి, ఉఫాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. కోర్టు కేసులు ఒక పట్టాన తేలవు. పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం, ఉత్తరాభద్ర నక్షత్రం వారు పుష్యనీలం, రేవతి నక్షత్రం వారు గరుడపచ్చ ధరించి శుభం కలుగుతుంది.