వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం : 4 అవమానం: 5
ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచూ చేబదుళ్లు, రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరుచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తుదోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. గృహనిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం, కనకధారా స్తోత్రములు ఈ రాశివారికి మంచి ఫలితాలిస్తాయి.
జనవరి-2025
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి....
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట,
ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఇంచుమించుగా ఫలిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మునుపటి కంటే చురుకుగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో తంగా సంభాషించండి.....
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు....
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. అపజయాలకు దీటుగా స్పందిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా....
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చిన్న విషయానికే నిరుత్సాహపడతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి.....