Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం: 4 ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోను కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య తరచు కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు అధికం. చిన్నతరహా వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు. తరుచు పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి. ఈ రాశివారికి తరచు శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం, జయం.

జనవరి-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సన్నిహితులతో....

ఫిబ్రవరి-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పన్ను చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో....

మార్చి-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థిక విషయాల్లో విశేష ఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యానికి యత్నాలు....

ఏప్రియల్-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం ప్రథమార్థం అనుకూలం కాదు. కీలక అంశాల్లో ఉత్సాహం తగ్గకుండా మెలగండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా ఖర్చు చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించండి. దంపతుల....

మే-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సన్నిహితులతో....

జూన్-2025

మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు.....

జులై-2025

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయుల ప్రోత్సాహం మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారంలో ఏకాగ్రత వహించండి.....