జాతకం

ధనస్సు
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం మీ లక్ష్యసాధనకు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఖర్చులు మీ స్థోమతకు తగినట్టే ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయులతో వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆది, గురువారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలు, పట్టింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వర్ణకార వృత్తుల వారు పనివారలకు ఓ కంట కనిపెట్టడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయింలు, అలవెన్సులు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులను సంప్రదించండి. నూతనపెట్టుబడులకు అనుకూలం.