జాతకం

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. గురు, శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మనోధైర్యంతో వ్యవహరించండి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు బాధ్యతల మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.