తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. సమష్టి కృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మంగళవారం నాడు ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒంటెద్దు పోకడ తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.