కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. ఆర్ధికంగా కుదుటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మొండిగా ముందుకు దూసుకువెళతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభం జరుగుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహనిర్మాణం ముగింపు దశకు చేరుకుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం.