జాతకం

సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరదు. పట్టుదలతో శ్రమించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కష్ట సమయంలో సన్నిహితులకు చేదోడువాదోడుగా నిలుస్తారు. ఉద్యోగస్తులైన మహిళలకు ఇంటా, కార్యాలయంలోను ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఒక శుభకార్యం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. ఉన్నత స్థాయి అధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఉమ్మడి వ్యవహారాలు, చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ అధికారులకు పురోభివృద్ధి. ఆత్మీయులతో వేడుకలు, విందులలో పాల్గొంటారు.