Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. గురువారం నాడు చేసిన పనులు మొదటికే వస్తాయి. ఆశవహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొనుగోలుదార్లతో సౌమ్యంగా మెలగండి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.