వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం అనుకూలతలు అంతంత మాత్రమే. మనోధైర్యంతో మెలగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పాతపరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.