మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ఒత్తిడికి గురికావద్దు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే మీ విజయానికి తోడడుతుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సోమవారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయి వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి శుభఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చేతివృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.