జాతకం

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ వారం వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆత్మయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. దైవదర్శనం ప్రశాంతంగా సాగుతుంది.