జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఏ వ్యవహారం కలిసిరాకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ముక్కుసూటిగా పోయే మీ తత్వం వివాదాలకు దారితీస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, శనివారాల్లో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు కొంత వరకు అధికమిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు ఏ మాత్రం స్పందన ఉండదు. చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలు, స్థల వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కావు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు మరికొంత కాలం వేచియుండటం శ్రేయస్కరం. ప్రముఖుల కలయిక అనుకూలించినా ప్రయోజనం శూన్యం. అనుకున్న పనులు ఆలస్యంగానైనా ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులు అర్హత పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితం.