జాతకం

మేషం
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయం లేనివారితో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. తప్పుదారి పట్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు.