Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ వారం కొంతమేరకు అనుకూలం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.