Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో వాయిదాలు చెలిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది.