Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్‌ను అశ్రద్ధ చేయకండి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగల్గుతారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దు. బోగస్ సంస్థలు మోసగించేందుకు యత్నిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.