Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అనివార్యం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.