Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మీకు సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మంగళవారం నాడు మీ శ్రీమతితో అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.