Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆదివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నోటీసులు అందుకుంటారు.