Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం తీరు అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. చిన్న సమస్యను పెద్దది చేసుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతిలోపం. సభలు, కీలక చర్చల్లో పాల్గొంటారు.