Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు, నిర్మాణాలు ముగుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీ సమర్ధతపై గురి కుదురుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రయాణంలో జాగ్రత్త.