మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ జీవితభాగస్వామిలో ఆశించిన మార్పు వస్తుంది. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ప్రోత్సాహకరం. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి.