మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు నిదానంగా ఆశించిన ఫలితాలిస్తాయి.