జాతకం

ధనస్సు
ధనర్‌రాశి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.