జాతకం

ధనస్సు
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో రాణిస్తారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం