Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రతికూలతలెదురైనా అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు దక్కవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.