Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయినవారే వెనకాడతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గృహమార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి.