Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా వుండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. దంపతుల మధ్య అవగాహనా లోపం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. సన్నిహితులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలలో నిలదొక్కుకుంటారు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వాహన చోదకులు అప్రమత్తంగా వుండాలి.