Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 4 పాదములు ప్రణాళికాబద్ధంగా అడుగు ముందుకేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. విద్యార్థులకు పని ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేతివృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.