జాతకం

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. బంధువుల వైఖరి అసనహం కలిగిస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆదాయం సంతృప్తికరం. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికీ అసహనం చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ప్రయాణం వాయిదా పడుతుంది.