జాతకం

తుల
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రథమార్థం ప్రతికూలతలు అధికం. రుణ, గృహ సమస్యలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.