జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.