జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పొదుపు పథకాలకు అనుకూలం. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలకు లౌక్యంగా వ్యక్తం చేయండి. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.