జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.