జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మాసం ప్రథమార్ధం బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. పనులు సానుకూలమవుతాయి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. పెట్టుబడులకు తరుణం కాదు. గృహమార్పు అనివార్యం. సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.