జాతకం

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. పెద్దల ప్రమేయంతో సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.