జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటాు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధం మరోదానికి ఖర్చు చేస్తారు. సోదరులతో పట్టింపులెదుర్కొంటారు. సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో సమస్యలెదురవుతాయి. గుట్టుగా వ్యవహరించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.