Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేక పోయామన్న వెలితి వెంటాడుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. వాస్తుకు అనుగుణంగా గృహమార్పు చేపడుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనయోగం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.