Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. ఆలోచనలతో సతమతమవుతారు. మనస్థిమితం వుండదు. ఆప్తులతో కాలక్షేపం చేసేందుకు యత్నించండి. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. పోగట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.