Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల మార్గదర్శకమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు స్థానంచలనం, హోదామార్పు. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన అధికం.